టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) రాజకీయం (Politics) వార్తలు (News)

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్మెంటల్ పరీక్షలు??

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జరీ చేసింది. అదేంటంటే..గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి అవుతుంటే వీరి ప్రొబేషన్ పూర్తి అయ్యేలోపు డిపార్ట్‌మెంటల్ పరీక్షతో పాటు సీబీఏఎన్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటికే చాలా మంది డిపార్ట్ మెంటల్ టెస్ట్ లు రాయడంతో వారిలో మళ్లీ పరీక్షలు ఏమిటి అనే ఆందోళన మొదలైంది.

ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది కేవలం డిపార్ట్ మెంటల్ పరీక్ష తప్ప ఏ పరీక్షలు నిర్వహించడం జరగదని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్ పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఎవరూ ప్రొబేషన్ విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. సీబీఏఎస్ పరీక్షలు కానీ ఏ ఇతర అదనపు పరీక్షలు ఉద్యోగులకు నిర్వహించడం లేదని ఆయన స్పష్టం చేసారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    108
    Shares
  • 108
  •  
  •  
  •  
  •