క్రైమ్ (Crime) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

కల్తీ మద్యం అమ్మినట్టు నేరం రుజువైతే ఉరిశిక్షే!!

కల్తీ మద్యం అమ్మడం వల్ల ఇప్పటివరకు జరిమానా విధించి వదిలేసేవారు. అదసలు పెద్ద నేరమే కాదని భావించి రూ.300 నుంచి రూ.2వేల వరకు మాత్రమే జరిమానా వేసేవారు. కానీ ఇప్పుడు ఆ జరిమానాను భారీగా పెంచడమే కాకుండా ఏకంగా ఉరిశిక్ష కూడా విధించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముసాయిదా బిల్లుని ఆమోదించింది.

మధ్యప్రదేశ్ లో కల్తీమద్యం కాటుకి ఏటా వేల సంఖ్యలో ప్రజలు బలవుతున్నా కూడా నామమాత్రపు జరిమానాలతో వదిలి పెడుతుండటంతో ఎవరూ లెక్కచేయడంలేదు. మందుబాబులుకూడా అవగాహనా రాహిత్యంతోనే కల్తీ మద్యానికి బలవుతున్నారు. ఈ దశలో కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం సిద్ధమైంది.

ఇకపై ఎవరైనా తమ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మితే వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తామని హెచ్చరిస్తోంది. అంతే కాకుండా కల్తీ మద్యం కారణంగా ఎవరైనా మరణిస్తే, అమ్మినవారికి జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధిస్తారు. జరిమానా మొత్తాన్ని 25లక్షల రూపాయలకు పెంచారు. అక్రమ మద్యం అమ్మకాలను అడ్డుకోడానికి వచ్చిన ఎక్సైజ్ పోలీసులపై దాడి చేశారని రుజువైతే మూడేళ్లపాటు శిక్ష ఖాయం. ఇలా అక్రమ మద్యం అమ్మకాల విషయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిబంధనలు తెరపైకి తెస్తోంది.

ఇప్పటి వరకు ఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ కల్తీ మద్యం అమ్మితే ఏకంగా ఉరిశిక్ష విధించేలా బిల్లు తీసుకు రావడం మాత్రం దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావడం విశేషం!ఈ కఠిన నిర్ణయంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    130
    Shares
  • 130
  •  
  •  
  •  
  •