క్రైమ్ (Crime) వార్తలు (News)

7 కోట్ల అవినీతి లో ఇంటి దొంగ హస్తం!!

పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యశాఖలొ భారీ కుంభకోణం సంచలనమైంది. ఏడు కోట్ల రూపాయల నిధులను ఆరగించిన ఇంటి దొంగల దెబ్బకు ప్రభుత్వం కూడా చతికిలబడినట్టైంది. బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లను ఫోర్జరీ సంతకాలతో డ్రా చేసిన కొందరు ఉద్యోగుల వ్యవహారం కాగా గత ఏడాది కరోనాతో మృతి చెందిన ఒక ఉద్యోగి కీలక పాత్ర పోషించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శాఖా పరమైన ఆడిట్ చేస్తుండగా ఈ స్కామ్ బయటపడడంతో ప్రభుత్వ కీలక అధికారులు కూడా తలలు పట్టుకున్నారు. దీని మీద ఇప్పటికే పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విషయం బయటకు రాకుండా జాగ్రత్తగా విచారణ చేపట్టారు. దీనిట్లో ఎవరిది అయినా రాజకీయ నాయకుల హస్తం ఉందా అనే దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •