రాజకీయం (Politics) వార్తలు (News)

వాసాలమర్రిలో కేసీఆర్‌!!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లాలో దత్తత గ్రామమైన వాసాలమర్రి కి హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గం ద్వారా చేరుకున్నారు. గ్రామానికి చేరుకున్న తరువాత సీఎం అధికారులతో కలిసి అక్కడి దళితవాడలో పర్యటించి స్థానికంగా ఉన్న రైతువేదికలో 130 మందితో సమావేశమయ్యారు. గతంలో ఇచ్చిన హామీల అమలును సీఎం సమీక్షించారు. గత జూన్‌ 22న ఈ గ్రామంలో పర్యటించిన కేసీఆర్‌ గ్రామస్తులతో సమావేశమై గ్రామాభివృద్ధిపై వారికి దిశానిర్దేశం చేశారు. సత్వర కార్యాచరణ కోసం అధికారులకు ఆదేశాలిచ్చారు. నేడు మరోసారి ఆ గ్రామంలో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •