ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

మీ ఎముకల పటుత్వాన్ని కాపాడుకోండిలా!!

క్యా ల్షియం అనేది మన శరీరానికి అత్యంత ముఖ్యమైనది. క్యా ల్షియం ఎముకల పటుత్వానికే కాదు కండరాలు, నాడులు, కణాలు సజావుగా పనిచేయటానికీ అవసరమే! మన శరీరం క్యాల్షియంను తనంతట తాను తయారు చేసుకోలేదు. ఆహారం ద్వారానే మనం అందివ్వాల్సి ఉంటుంది.

ఆహారంలో తగినంత క్యాల్షియం లేకపోయినా, శరీరం క్యాల్షియంను గ్రహించలేకపోయినా ఎముకలు బలహీనమవుతాయి. కనుక వీలైనంత వరకు క్యాల్షియం నిల్వలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా 35 ఏళ్లకు ముందే దీన్ని సాధించాలి. ఎందుకంటే ఎముక సాంద్రత 25-35 ఏళ్లలోనే ఎక్కువగా ఉంటుంది. వయసు పెరుగుతున్నకొద్దీ తగ్గుతూ వస్తుంటుంది. హార్మోన్లు సజావుగా పనిచేయటానికి క్యాల్షియం కావాలి. ఇవి రోజూ ఎముకల నుంచి కొంత క్యాల్షియాన్ని తీసుకుంటూ రక్తంలో క్యాల్షియం మోతాదులు నిలకడగా ఉండేలా చూసుకుంటాయి.

ఇది ఎముక క్షీణతకు దారితీస్తుంది. కాబట్టే వయసు పెరుగుతున్నకొద్దీ క్యాల్షియం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం మంచిది. పాలు.. పెరుగు, మజ్జిగ, పన్నీరు, ఛీజ్‌ వంటి పాల పదార్థాలు, పాలకూర వంటి ఆకు కూరలు, సాల్మన్‌, సారడైన్‌ వంటి చేపలను క్రమం తప్పకుండా తీసుకుంటే క్యాల్షియం కావలసినంత అందుతుంది. మనకు రోజుకు కనీసం 1200 మి.గ్రా. క్యాల్షియం, 800 నుంచి 1,000 విటమిన్‌ డి కూడా కావాలి. శరీరం క్యాల్షియాన్ని గ్రహించడానికి తోడ్పడేది డి విటమిన్.అందుకే ఇవి రెండు శరీరానికి కావలసినంత అందించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •