అంతర్జాతీయం (International) వార్తలు (News)

అమ్మకానికి సిద్ధంగా.. లాడెన్ సోదరుడి బంగ్లా !!

ఒసామా బీన్ లాడెన్ అంటే ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాది. 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్‌ను కూల్చివేతలో ప్రధానపాత్ర పోషించడంతో లాడెన్ పాక్‌లో తలదాచుకున్న సమయంలో ఆయన్ను అమెరికా సైన్యం హతమార్చింది. అయితే లాడెన్ సోదరుడు ఇబ్రహీమ్ కు లాస్ ఎంజెల్స్‌లో ఒక విలాసవంతమైన భవంతి ఉంది. 2001 ఘటనకు ముందు వరకు ఆ ఇంట్లో ఇబ్రహీమ్ లాడెన్ కుటుంబ సభ్యులు ఉండేవారు. ఎప్పుడైతే 2001లో ట్విన్ టవర్స్ కూల్చివేత జరిగిందో ఆ తరువాత ఆ కుటుంబం ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి ఆ ఇల్లు ఖాళీగా ఉన్నది. 20 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న ఇంటిని లాడెన్ కుటుంబ సభ్యలు ఇప్పుడు ఆమ్మకానికి పెట్టారు. రెండు ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో విస్తరించిన భవంతిని 28 మిలియన్ డాలర్లకు అమ్మకానికి పెట్టినట్టుగా తెలుస్తుంది. 1931లో నిర్మించిన ఈ భవంతిని ఇబ్రహీం రెండు మిలినియన్ డాలర్లకు 1983లో కొనుగోలు చేశారు. అప్పట్లో ఒసామాబీన్ లాడెన్ కూడా ఆ భవంతిలో కొన్నాళ్లు నివశించడం కొసమెరుపు!!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •