టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

మచిలీపట్నం BEL లో ఉద్యోగాలకు నోటిఫికేషన్!!

కరోనా విజృంభణ తగ్గుతున్న నేపథ్యంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లు విడుదల చేస్తున్నాయి. ఈ తరుణంలోనే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రస్తుతం మచిలీపట్నం యూనిట్లో ఈ నియామకాలు చేపడుతున్నారు.

మొత్తం 6 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ విభాగంలో నియామకాలు చేపట్టినట్టు నోటిఫికేషన్లో తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని, కాంట్రాక్ట్ విధానంలో ఈ నియామకాలు చేపట్టినట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఖాళీలను భర్తీ చేస్తుండగా ఇందులో మూడు ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో ఉండగా, మరో మూడు ట్రైనీ ఇంజనీర్ విభాగంలో ఉన్నాయి.

అర్హతలు:

అభ్యర్థులు ఫస్ట్ క్లాసులో పాసై ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) విభాగంలో 1 ఖాళీ, ప్రాజెక్ట్ ఇంజనీర్(మెకానికల్) విభాగంలో 1, ప్రాజెక్ట్ ఇంజనీర్(సివిల్) విభాగంలో 1, ట్రైనీ ఇంజనీర్(ఎలక్ట్రికల్) విభాగంలో 1, ట్రైనీ ఇంజనీర్(మెకానికల్) విభాగంలో 1, ట్రైనీ ఇంజనీర్(సివిల్) విభాగంలో మరో ఖాళీ ఉంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 3లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న వారు రూ. 500, ట్రైనీ ఇంజనీర్ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న వారు రూ. 200లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. PWD, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •