జాతీయం (National) వార్తలు (News)

18వ రోజు కూడా స్థిరంగా కొనసాగిన చమురు ధరలు!!

గత కొంతకాలంగా రోజువారీ పెరుగుతున్న ఆయిల్ ధరలు ఇటీవల కాలంలో స్థిరత్వాన్ని సంతరించుకుని వాహనదారులకు కాస్త ఊరట అందించాయి. వరుసగా 18వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగాయని చెప్పుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు మాత్రం తగ్గాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ జాబితా ను అనుసరించి..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.84 ఉండగా, డీజిల్‌ రూ.89,87గా ఉంది.
ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.107.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.97.45గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.105.83 ఉండగా, డీజిల్ ధర రూ.97.96 ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ. 107.35 కాగా, డీజిల్‌ రూ. 98.65 గా ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 108.05 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.99.62గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 102.08 ఉండగా, డీజిల్‌ ధర రూ.93.02 ఉంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.49 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.39 గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుండడంతో ధరలు ఒక రోజు పెరిగి, మరో రోజు తగ్గి, లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •