వార్తలు (News)

షార్ట్ సర్క్యూట్ కారణంగా పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనం దగ్ధం!!

హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్‌ కూడలిలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనం లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన సిబ్బంది
వాహనం నుంచి కిందికి దిగిపోవడంతో ప్రాణాపాయం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అయితే ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో కొంచంసేపటి వరకు ఆ ప్రాంతంలో గందరగోళం జరిగి ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఆ తరువాత పోలీసులు వాహనాల రద్దీని క్రమబద్ధీకరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    60
    Shares
  • 60
  •  
  •  
  •  
  •