ఎన్నికలు (Elections) రాజకీయం (Politics) వార్తలు (News)

భవానీపూర్ ఉపఎన్నికలో భారీ స్థాయిలో గెలుపొందిన మమతా బెనర్జీ!!

‘భవానీపూర్‌ ఫలితాల్లో మమతా బెనర్జీ భారీ విజయం సాధించింది. ‘‘భవానీపూర్‌లో మమతా బెనర్జీ గెలుస్తారా? లేదా? అనే విషయంలో మాకు ఎలాంటి సందేహమూ లేదు. ఫలితాల్లో ఆమె ఆధిక్యాన్ని మరింత పెంచుతూ… దేశం మొత్తానికి ఒక సందేశం ఇవ్వాలని అనుకున్నాం. ఈ విషయంలో తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే మా తదుపరి లక్ష్యం.’’ అంటూ రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి, సీనియర్ తృణమూల్ నాయకుడు ఫిర్హాద్ హకీం వ్యాఖ్యానించారు. భవానీపూర్‌లో మమతా ప్రచారాన్ని ఈయనే దగ్గరుండి నడిపించారు.

మరోవైపు గెలుపు అనంతరం మమతా కూడా మీడియాతో మాట్లాడుతూ ‘‘నందిగ్రామ్‌లో జరిగిన కుట్రకు భవానీపూర్ ప్రజలు సమాధానం ఇచ్చారు’’అని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలో భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించిన మమత, తన రికార్డును తానే తిరగరాసుకున్నారు. కేవలం 57 శాతం ఓటింగ్ నమోదైనప్పటికీ, బీజేపీ అభ్యర్థి ప్రియాంకా టిబరేవాల్‌పై 59 వేల ఓట్ల తేడాతో మమత విజయం సాధించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •