క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

టెర్రర్ ఫండింగ్ అనుమానంతో పూంచ్‌లో ఎన్ఐఏ దాడి!!

హవాలా మార్గాల ద్వారా ఉగ్రవాదులకు డబ్బు చేరవేస్తున్న వ్యాపారులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉక్కుపాదం మోపుతోంది. క్రాస్ ఎల్ఓసి ట్రేడ్ కేసుకు సంబంధించి జమ్ముకశ్మీర్ సరిహద్దు జిల్లా పూంచ్‌లో ఈరోజు తెల్లవారుజామున ప్రారంభమైన రైడ్ అనేక ప్రదేశాలలో అనేక మంది వ్యాపారుల ఇల్లు, వ్యాపార సంస్థలపై దాడి చేసింది.

వ్యాపారులు మహ్మద్ షఫీ, ముస్తాక్ అహ్మద్, జావేద్ అహ్మద్, మహ్మద్ అజమ్, షాజాద్ అహ్మద్, మహ్మద్ అక్రమ్, తారిక్ అహ్మద్, అబ్దుల్ ఘనీ ఇండ్లు, వ్యాపార స్థలాలపై ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో కీలక పత్రాలను, డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ పోలీస్, సిఆర్‌పిఎఫ్, ఐటిబిపిల సహాయంతో ఎన్‌ఐఏ బృందాలు కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌ లోని పూంచ్ జిల్లాలో 10 ప్రదేశాలలో సోదాలు నిర్వహించాయి.

కాగా పోలీసులు లాక్ ట్రేడ్ కేసు నెం RC-17/2016/NIA/DLI. UA (P) చట్టం, 1967 సెక్షన్ 17 కింద NIA డిసెంబర్ 9, 2016 న కేసు నమోదు చేసింది. జమ్ముకశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK) మధ్య విశ్వాసాన్ని పెంపొందించే చర్యలలో భాగంగా 2008 లో క్రాస్ LoC వాణిజ్యం ప్రారంభించబడింది. ఈ వర్తకంలో కొందరు అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో విచారణ చేపట్టారు. హవాలా మార్గాల ద్వారా డబ్బు టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నేడు ఎన్ఐఏ అధికారులు దాడులు చేసినట్టు సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •