వార్తలు (News)

కెనాల్‌ రోడ్డు కు మరమ్మత్తులు మొదలు పెట్టిన ఆర్‌ అండ్‌ బీ అధికారులు!!

సామర్లకోట రూరల్‌ హుస్సేన్‌ పురం, వెట్లపాలెం గ్రామాల మధ్య ద్వారపూడి కెనాల్‌ రోడ్డు పూర్తి స్థాయిలో శిధిలం అయ్యి నిత్యం వేలాది మంది వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం పాఠకులకు విదితమే. ఈ సమస్యపై అనేక పత్రికల్లో ఇప్పటికే కథనాలు రావడంతో ఎట్టకేలకు ఆదివారం కెనాల్‌ రోడ్డు మరమ్మత్తు పనులకు కాంట్రాక్టర్‌ సిబ్బంది శ్రీకారం చుట్టారు. జెసిబీ, ట్రాక్టర్‌, తారు మరగబెట్టి కంకర రాళ్ళ తో కలిపే యంత్రాలు కూలీలు చేరుకుని రోడ్డు, గోతులను సమీపంలో ఉన్న తుప్పలను తొలగిస్తున్నారు. తాత్కాలిక మరమత్తులు ఎక్కడ వరకు చేస్తోరో ఇంకాపూర్తి సమాచారం లేదు. పూర్తి స్థాయిలో శిధిలం అయ్యిన కెనాల్‌ రోడ్‌ ను 100 శాతం పనులు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •