రాజకీయం (Politics) వార్తలు (News)

స్టీల్‌ ప్లాంట్‌ పోరాటం మరింత ఉధృతం??

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, ప్రభుత్వరంగ సంస్థలు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు శుక్రవారం నాటికి 183వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో ఎఐటియుసి నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా పడాల రమణ మాట్లాడుతూ, నెలల తరబడి కార్మికవర్గం, ప్రజా సంఘాలు పోరాటాలు చేస్తున్నా కేంద్రం పెడచెవిన పెడుతూ లీగల్‌ ట్రాన్సాక్షన్‌ అడ్వయిజరీలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటు పరం కాకుండా రక్షించుకునేందుకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని విశాఖ కార్మిక, ప్రజా సంఘాల జెఎసి వైస్‌చైర్మన్‌, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ అన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా చలో పార్లమెంటు నిర్వహిస్తామని, స్టీల్‌ ప్లాంటు ప్రయిటీకరణ వ్యతిరేక పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్న అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిలు ప్రజల కేంద్రంగా పోరాటానికి దిగాలని అన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    4
    Shares
  • 4
  •  
  •  
  •  
  •