జాతీయం (National) వార్తలు (News)

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం ట్రేడింగ్‌ను లాభాలతో ఆరంభించి నాలుగు రోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కాయి. ఉదయం 59,063 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ కాసేపటికే భారీ లాభాల్లోకి దూసుకెళ్లింది. ఒక దశలో 667 పాయింట్లు ఎగిసిన సూచీ చివరికి 533.74 పాయింట్ల లాభంతో 59,299 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 159.30 పాయిట్లు లాభపడి 17,691 వద్ద స్థిరపడింది.

నిఫ్టీలో దివీస్‌తో పాటు హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఎన్టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా మోటార్స్‌ షేర్లు రాణించాయి. సిప్లా, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, యూపీఎల్‌, ఐషర్‌ మోటార్స్‌, ఐవోసీ షేర్లు నష్టపోయాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •