దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12,52,596 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 8,603 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.46 కోట్ల కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 415 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4.7లక్షలకి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుండి 8,190 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 99,974గా ఉంది.