ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఉల్లంఘనలపై పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.120కోట్ల జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా కట్టిన మూడు ప్రాజెక్టులకు జరిమానా విధించింది. దీనిలో భాగంగా పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు సంబంధించి రూ.24.56 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు రూ.73.6 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి రూ.24.90 కోట్ల జరిమానా విధించింది.

ఈ జరిమానాను 3 నెలలలోపు ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. జరిమానా నిధుల వినియోగంపై ఏపీ పీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీ నియమించాలని స్పష్టం చేసింది.