ఏపీ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ కౌన్సెలింగ్‌ను డిసెంబర్‌ 4 నుంచి 13 వరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ విడుదల చేసింది.

వివరాలు చూడండి..
డిసెంబర్‌ 4 నుంచి 8 వరకు రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. 9వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు. 10వ తేదీన ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంది. 13వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. 14 నుంచి 18 లోపు సీట్లు పొందిన వారు కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది.