ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో సీఎం జగన్‌ స్పష్టత ఇస్తూ పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ప్రకటన చేశారు. తిరుపతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సమయంలో కొందరు ఉద్యోగులు పీఆర్సీ గురించి ప్లకార్డులను ప్రదర్శించడంతో వాటిని గమనించిన సీఎం దీనిపై స్పందిస్తూ పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యిందని, పది రోజుల్లో ప్రకటన ఉంటుందని వారికి తెలిపారు.