ఎండిన మునగకాయలోని విత్తనాలను పొడిచేసి ఆ పొడిని ఒక చెంచా తేనేతో సేవిస్తే బి.పి కంట్రోల్ అయి ఆదుర్దా తగ్గుతుంది.
మునగ రసం క్యారెట్ రసంతో కలిపి తాగాలి. పచ్చిదోస రసం, మునగ రసం చెరొక గరిటెడు కలిపి తాగినా మూత్రం సాఫీగా అవుతుంది. మునగాకు రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే అజీర్ణ సంబంధ బాధ ఉండదు.
మునగాకు పొడిని రోజూ పరగడుపున చెంచా పొడిని మజ్జిగలో కలుపుకుని తాగితే గాస్ట్రిక్ అల్సర్ దరిచేరదు.
మునగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరిగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెలరోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని అంగస్తంభన అవుతుంది.
మునగాకు రసంలో మిరియాల పొడి కలిపి కణతలపై రాస్తే మునగ గింజలని చూర్ణం చేసి కషాయంగా వాడినా తలనొప్పికి ఉపశమనం కలిగిస్తుంది.
మునగాకు నీడలో ఆరబెట్టి, పొడిచెయ్యాలి. ఆ పొడిలో నీళ్ళు కలిపి పేస్టులా చేసి తలకు రాసుకొని కొంత సేపు ఆగి తలస్నానం చెయ్యాలి. ఆ విధంగా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.