ఎన్‌బీసీసీ లిమిటెడ్‌ లో 70 వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో డిప్యూటీ ప్రాజెక్ట్‌ మేనేజర్ (ఎలక్ట్రికల్‌) ఉద్యోగ ఖాళీలు 10, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ ఉద్యోగ ఖాళీలు 55, ప్రాజెక్ట్ మేనేజర్‌ (సివిల్‌) ఉద్యోగ ఖాళీలు 1, సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగ ఖాళీ 1, ఆఫీస్‌ అసిస్టెంట్‌ (స్టెనోగ్రాఫర్‌) ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. 25 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిప్యూటీ ప్రాజెక్ట్‌ మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 50,000 నుంచి రూ. 1,60,000 వరకు వేతనం లభిస్తుంది.

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000 వరకు వేతనం లభిస్తుంది. ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 60,000 నుంచి రూ. 1,80,000 వేతనం లభిస్తుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2022 సంవత్సరం జనవరి నెల ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.