ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌పై బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ అనంతరం జారీచేసిన ప్రొక్లమేషన్ ఆర్డర్‌ను మెజిస్ట్రేట్ కోర్టు గురువారం రద్దు చేసింది.

గత వారం పరమ్ బీర్ సింగ్ గతంలో కోర్టులో హాజరుకాకపోవడంతో రమ్ బీర్ సింగ్ పరారీలో ఉన్నట్లు నవంబర్ 17న జారీచేసిన ప్రొక్లమేషన్ ఆర్డర్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది గత వారం కోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు. దీంతో మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ప్రొక్లమేషన్ ఆర్డర్‌ను రద్దు చేసింది.

అసలు ప్రొక్లమేషన్ ఆర్డర్‌ ఆంటే ఏంటంటే.. సిఆర్‌పిసికి చెందిన సెక్షన్ 82 ప్రకారం నిందితుడిని కోర్టులో హాజరుపరచాలని వారెంట్ జారీచేసిన తర్వాత అది అమలు కాని పక్షంలో కోర్టు ప్రొక్లమేషన్ ఆర్డర్ జారీచేసే అవకాశం ఉంటుంది. అంతేగాక సెక్షన్ 83 ప్రకారం నిందితుడికి సంబంధించిన ఆస్తులను కోర్టు జప్తు చేసే అధికారం కూడా ఉంటుంది.