రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకొక ట్విస్టు ఎదురవుతుంది. పోలీస్ శాఖవారు రెండేళ్ల పాటు నిందితులని పట్టుకోలేకపోవడంతో ఈ కేసు సీబీఐ కి అప్పగించారు. చార్జిషీటు దాఖలు చేసిన అధికారులు అనుమానితులను అందులో చేర్చి విచారణ జరిపించారు. అయితే వీరిని తప్పించడానికి తెరవెనక భారీ వ్యూహాలు రచిస్తున్నట్టు అనుమానం. ఎందుకంటే నిందితులు క్వాష్ పిటిషన్ వేసుకోవడంతో కేసు కొలిక్కిరావడం లేదు. అనేక పిటిషన్లు వేయడం కారణంగా అసలు విషయం పక్కదారి పట్టే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. అసలు కేసు విషయం పక్కన పెట్టి క్వాష్ పిటిషన్ల విచారణ నిర్వహించడంతో వివేక హత్యకేసు విచారణ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది.

ఈ కేసులో అప్రువర్ గా మారిన వివేకానంద కారు డ్రైవరు షేక్ దస్తగిరి ఇప్పటికే పోలీసులకు అన్ని విషయాలు వివరిస్తూ.. బెంగళూరు లాండ్ విషయంలో వాటా ఇవ్వని కారణంగానే వివేకానందరెడ్డి హత్యకు ప్లాన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో ఒప్పుకుని, గంగిరెడ్డి హత్యకు ప్లాన్ చేశాడని.. రూ.40కోట్లు ఇస్తానన్నాడని.. అయినా.. తాను హత్య చేసేందుకు ఒప్పుకోలేదని వివరించాడు.ఈ క్రమంలోనే విచారణలో పెద్ద పెద్ద నేతల పేర్లు ప్రస్తావించాడు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఊమాశంకర్ తో కలిసి వివేకానందను హత్య చేసినట్లు దస్తగిరి ఒప్పుకున్నాడు.

అయితే దస్తగిరి, గంగిరెడ్డి , దస్తగిరి క్వాష్ పిటిషన్లతో కేసునుంచి తప్పించుకునే ఆలోచన చేస్తున్నారని బీసీఐ అధికారులు భావిస్తున్నారు. కేసు విచారణను ఆలస్యం చేసేందుకు ఇద్దరూ కలిసి అనవసరపు పిటిషన్లు వేస్తూ.. విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ హైకోర్టులో ఒకేరోజు రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అందులో ఒకటి ఎర్ర గంగిరెడ్డిది కాగా.. ఆయన దస్తగిరి ఇచ్చిన వాగ్మూలంలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. గతంలోనే బెయిల్ పై విడుదల కాగా.. ఇప్పుడు తనకు కేసుతో సంబంధం లేదని కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే క్రమంలో దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు అంగీకరించొద్దని.. మరో పిటిషన్ దాఖలు అయ్యింది. అంటే.. ఒక్క కీలక కేసు నుంచి నిందితులు తప్పించుకునేందుకు అనేక రకాల పిటిషన్లు దాఖలు చేస్తూ.. వివేకా హత్యకేసును నీరుగారుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా పిటిషన్లు దాఖలు చేసుకుంటూ పొతే ఈ కేసు విచారణ పూర్తి కావడానికి ఇంకా ఎంత కలం పడుతుందో వేచి చూడవలసిందే!