దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 13,88,647 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 58,097 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటి వరకూ దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.50 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 534 మంది మరణించడంతో ఇప్పటి వరకూ మరణించిన వారి మొత్తం సంఖ్య 4,82,551 కు చేరింది. గత 24 గంటల్లో 15,389 మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం రికవరీల సంఖ్య 3.43 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 2.14 లక్షలకు చేరింది.

దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 2,135 మంది ఓమిక్రాన్ బారిన పడ్డారు.