కొంతమందికి రోజుకి రెండుసార్లు బ్రష్ చేసుకున్న కూడా నోట్లో నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటి వారు ఇంట్లో లభ్యమయ్యే వాటితోనే నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు. అవేంటంటే.. ఏలకుల గింజలను ప్రతిరోజు రోజుకు ఐదారుసార్లు గా నములుతూ ఉంటే నోటిదుర్వాసన తగ్గిపోతుంది. అలాగే భోజనం చేసిన తర్వాత చిన్న దాల్చినచెక్క ముక్కను నోటిలో వేసుకొని చప్పరిస్తుంటే కూడా నోటి దుర్వాసన తగ్గిపోయి దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి.

భోజనం చేసిన తర్వాత లవంగము చప్పరిస్తుంటే నోటిదుర్వాసన తగ్గిపోతుంది. ఇంకా ప్రతిరోజూ కొద్దిగా వామును నమిలి తింటుంటే నోటిదుర్వాసన తగ్గిపోతుంది. చెరుకుగడను పండ్లతో నమిలి తింటుంటే దంతాలు చిగుళ్లు గట్టిపడతాయి కాకుండా నోట్లోని క్రిములు నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. ఉప్పును లవంగాలను కలిపి నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే నోటి దుర్వాసనతో పాటు ఆయాసం కూడా తగ్గిపోతుంది. వీటిలో మీకు ఏది వీలుపడితే దానిని పాటించడం వలన నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు.