నిన్నటి వరకు హుషారుగా సాగిన దేశీయ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 81 పాయింట్ల నష్టంతో 59,774 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 25 పాయింట్లు నష్టపోయి 17,780 వద్ద ట్రేడవుతున్నాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ అల్ట్రాటెక్ సిమెంట్స్‌, ఎంఅండ్‌ఎం, నెస్లే ఇండియా, మారుతీ, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.
రిలయన్స్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, విప్రో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.