హైదరాబాద్ ​యూనివర్సిటీలో పలు సబ్జెక్టుల వారీగా పీహెచ్​డీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21వ తేదీ వరకు ధరకాస్తులకు గడువు ఉందని అధికారులు స్పష్టం చేశారు. హాల్​టికెట్ డౌన్​లోడ్, పరీక్షకు సంబంధించిన అంశాలను త్వరలో ప్రకటిస్తామని, హైదరాబాద్​లో మాత్రమే పరీక్ష కేంద్రాలుంటాయని పేర్కొన్నారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ​ఆఫ్​ ఎగ్జామినేషన్స్​ దేవేశ్​ నిగమ్​ వెల్లడించారు. వివరాలకై https://acad.uohyd.ac.in లేదా http://www.uohyd.ac.in ని సంప్రదించాలి.