దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నేడు కూడా లాభాల్లో ముగిసాయి. ఉదయం సెన్సెక్స్‌ 59,921.98 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమై కాసేపటికే అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో 59,661.38 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసి ఆ తర్వాత నుండి ఊగిసలాటలో పయనించి 60,332.72 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసి చివరకు 367.22 పాయింట్ల లాభంతో 60,223.15 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 17,820.10 వద్ద సానుకూలంగా ప్రారంభమై 17,944.70 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 120.00 పాయింట్లు లాభపడి 17,925.25 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ముగిసాయి. విప్రో, హెచ్ సి ఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాల్లో ముగిసాయి.