ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రవీంద్ర భారతి కూడా కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు, రవీంద్ర భారతి ప్రాంగణంలో జరగాల్సిన సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ రద్దు చేసింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు, ప్రభుత్వ ఆదేశాల మేరకే మూసివేస్తున్నట్లు తెలిపారు.