రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంపై పడడంతో ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో 3 జనవరి నుండి 10 జనవరి వరకు జరగాల్సిన వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు రద్దు చేశారు. అలాగే స్వామి వారి తిరువీధి సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో బి.శివాజీ ఒక ప్రకటనలో తెలియజేశారు.

దేవస్థానంలో సేవల పునరుద్ధరణ గురించి కరోనా ప్రభావం ముగిశాక ప్రకటిస్తామని, భక్తులు సేవల రద్దు విషయంలో సహకరించాలని ఈవో బి.శివాజీ తెలియచేసారు.