రాజకీయం (Politics)

నిమ్మ‌గ‌డ్డ మాట విని రూల్స్ దాటిన అధికారుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వు

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఆయ‌న మాట విని ఎవ‌రైనా అధికారులు, క‌లెక్టర్లు నిబంధ‌న‌లు అతిక్ర‌మించి ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తే క‌చ్చితంగా వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి హెచ్చ‌రించారు. త‌మ ప్ర‌భుత్వం ఉన్న‌న్ని రోజులు అలాంటి అధికారుల‌ను బ్లాక్ లిస్టులో పెడ‌తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మార్చ్ 31 వ‌ర‌కు తాము ఏమీ మాట్లాడ‌మ‌ని, నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఏమీ చేసినా ప్ర‌జ‌లు త‌మ‌వైపే ఉన్నార‌ని, ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధిస్తామ‌ని పేర్కొన్నారు.

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏక‌గ్రీవాల‌ను ప్ర‌క‌టించ‌కుండా నిమ్మ‌గ‌డ్డ అడ్డుకోవ‌డం దారుణ‌మ‌ని ఆయ‌న అన్నారు. ఆయ‌న కేవ‌లం చంద్ర‌బాబు మెప్పు కోస‌మే ప‌ని చేస్తున్నార‌ని, ఇటువంటి వ్య‌క్తి మాట విని ఏక‌గ్రీవంగా ఎన్నికైన వారికి డిక్ల‌రేష‌న్లు ఇవ్వ‌ని అధికారుల‌ను గుర్తుపెట్టుకొని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఏక‌గ్రీవాల‌ను అడ్డుకునే అధికారం నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌కు లేద‌న్నారు. ఈ విష‌యం ఆయ‌న‌కు కూడా తెలుస‌ని, అధికారుల‌ను భ‌య‌పెట్ట‌డానికే ఏక‌గ్రీవాల‌ను అడ్డుకుంటున్నార‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు క‌నీసం ఓటు ఎలా న‌మోదు చేయించుకుంటారో కూడా అవ‌గాహ‌న లేద‌ని, హైద‌రాబాద్‌లో ఉంటూ గుంటూరులో ఓటు హ‌క్కు కావాల‌ని అంటున్నార‌ని పెద్దిరెడ్డి విమ‌ర్శించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.