వార్తలు (News)

శ‌భాష్ శిరీష‌… మాన‌వ‌త్వం చాటిన ఎస్సైకు డిస్క్ అవార్డు

అనాధ శ‌వాన్ని రెండు కిలోమీట‌ర్లు భుజంపై మోసిన శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ఎస్సై శిరీష‌కు డీజీపీ డిస్క్ అవార్డు ల‌భించింది. శుక్ర‌వారం డీజీపీ కార్యాల‌యంలో డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ఆమెకు ఈ అవార్డు, ప్ర‌శంసా ప‌త్రాన్ని అందించారు. ఇటీవ‌ల కాశిబుగ్గ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని అడ‌వికొత్తూరు గ్రామంలోని పంట పొలాల్లో ఓ వృద్ధుడి మృత‌దేహం ల‌భించింది.

అంత్య‌క్రియ‌ల‌కు త‌ర‌లించేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో ఎస్సై శ‌రీష చొర‌వ చూపించి రెండు కీలోమీట‌ర్ల పంట పొలాల మీదుగా మృత‌దేహాన్ని మోశారు. త‌న‌కు అవార్డు రావ‌డం సంతోషంగా ఉంద‌ని శ‌రీష పేర్కొన్నారు. సమాజంలో ఒక ఆడపిల్లగా శవాన్ని మోయడం అందరూ వ్యతిరేకిస్తారని, కానీ ఒక పోలీసుగా నా బాధ్య‌త‌ను నెర‌వేర్చేందుకు తాను అంబులెన్స్ వరకూ ఆ శవాన్ని మోసానన్నారు. త‌న తలిదండ్రులు నేర్పిన సేవాభావం ఈ రోజు అవార్డు తెచ్చిపెట్టిందన్నారు. డీజీపీకి ఆమె ధన్యావాదాలు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.