క్రైమ్ (Crime) వార్తలు (News)

ఘోర అగ్ని ప్రమాదంలో 40 ఇళ్ళు దగ్ధం

శుక్రవారం మధ్యాహ్నం విజయనగరం జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో హోర అగ్ని ప్రమాదం సంభవించి మొత్తం 40 పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటన జరిగినది
విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో దేవుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొండవానిపాలెంకు చెందిన గిరిజన గ్రామంలో. ఈ అగ్ని ప్రమాదంలో 40 పూరిళ్లు దగ్ధం కాగా, వాటిలో నాలుగు స్లాబ్ ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గ్రామంలో తొలుత కరాచీ కుమారి ఇంటికి సమీపంలో పశువుల శాల వద్ద మంటలు చెలరేగి ఆ తర్వాత గ్రామం మొత్తం ఆ మంటలు వ్యాపించడంతో పూరిళ్లన్నీ బూడిదయ్యాయి.

ఈ ప్రమాదంలో దుస్తులు, ధాన్యం, దాచుకున్న డబ్బు కాలిపోవడంతో బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక కేంద్రం అధికారి కె. అప్పారావు తన సిబ్బందితో వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రమాద విషయం తెలిసిన కూడా నీటి సదుపాయం లేకపోవడంతో రెండు ప్రాంతాల నుంచి నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పివేశారు.

కాగా, తహసీల్దార్ సీతారామరాజు, ఆర్ఐ పార్థసారథి, వీఆర్ఓనాగరాజులు బాధితులను పరామర్శించి, నష్టాన్ని అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాద బాధితులకు స్థానిక నాయకులు భోజన ఏర్పాట్లు చేశారు. అగ్ని మాజీ ఎంపీపీ రాపాక సూర్యప్రకాష్ రావు, మాజీ సర్పంచ్ అచ్చెన్నాయుడు, పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ చైర్మన్, వార్డు సభ్యుడు రాపాకసాయి సురేష్ తదితరులు బాధితులను పరామర్శించారు.


ఈ ప్రమాదంలో కనీసం రూ. 40 లక్షల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బాధితులు కోరుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.