మేనరిక సంబంధం వాళ్ళ పిల్లలు జన్యులోపంతో పుడతారని ప్రభుత్వాలు, డాక్టర్ లు ఎంత చెప్పిన ఇంకా అవి ఆలా కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివానిపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ, మోహన్‌రావు లది కూడా మేనరిక సంబధమే! వారికి ముందు ఒకబిడ్డ ఉండగా ఇప్పుడు వెంకటేశ్వరమ్మ కి రెండో కాన్పులో ఒక శిశువు జన్మించింది. కానీ జన్యు లోపంతో ఉన్న ఆ శిశువు మూడు కాళ్లతో జన్మించింది. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగానే ఉందని నూజివీడు ఆస్పత్రి సూపరింటెండెంట్ నరేంద్రసింగ్‌ తెలిపారు.