‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ నేడు స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పిలుపు ఇచ్చిన సంగతి పాఠకులకు తెలిసిందే! ఈరోజు దానిని అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. భాజపా మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు బంద్‌కు పరిపూర్ణంగా సహకరించడం గుర్తించదగ్గ విషయం. ప్రభుత్వం కూడా దీనికి మద్దతు ప్రకటించింది. పోరాట సమితి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మూసేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లారీ యజమానుల సంఘాలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు బంద్‌కు పూర్తి మద్దతునిచ్చాయి. ముందుగా నిర్ణయించినట్టు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు బస్సులన్నీ డిపోలకే పరిమితం కానున్నాయి.