దేశ రాజధాని దిల్లీలో కూడా కరోనా కేసుల సంఖ్య కలవరాన్ని కలిగిస్తుంది. కొత్తగా 59,112 శాంపిల్స్‌ పరీక్షిస్తే 312 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మూడు మరణాలు సంభవించాయి. జనవరి 14 తర్వాత ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. ఇప్పటిదాకా 1,26,81,441 శాంపిల్స్‌ పరీక్షిస్తే 6,40,494 మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. వీరిలో 6,27,797మంది కోలుకోగా, 10,918మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం అక్కడ 1,779 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.