గత 24 గంటల వ్యవధిలోనే మహారాష్ట్రలో 10,216 కొత్త కేసులు నమోదయ్యాయి. గత కొంతకాలంగా తగ్గినట్టే కనపడిన రోజువారీ కేసులు ఫిబ్రవరి రెండో వారం నుంచి క్రమంగా పెరోగి కలవర పెడుతున్నాయి. ఇప్పటికి 53 మంది మరణించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండట ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒక్క ముంబయి మహా నగరంలోనే 1,173 కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,467 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.


ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,66,86,880 శాంపిల్స్‌ను పరీక్షిస్తే 21,98,399 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 20,55,951 మంది కోలుకొని డిశ్చార్జి అవ్వగా 52,393 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో రికవరీ రేటు 93.52శాతంగా ఉంది. ప్రస్తుతం 88,838 క్రియాశీల కేసులు ఉన్నాయి. మరోవైపు, కొత్తగా వస్తున్న కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటకల్లోనే 85 శాతంగా ఉంటున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంటోంది.