హైద్రాబాద్లో మినీ ట్యాంకుబండ్ గా చెప్పుకునే సరూర్ నగర్ గ్రీన్‌పార్క్‌ కాలనీ చెరువులో
అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించింది. వెంటనే చాలామంది కెమెరాలతో బంధించారు. దీనితో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఆ చెరువుకి ఆనుకుని పూర్తిగా ఇల్లు ఉన్నాయి. ఆ మొసలి అసలు అక్కడ ఎలా వచ్చిందో ఇంకా తెలియలేదు. అది ఒకటే ఉందా? ఇంకా ఉన్నాయా అనే విషయం కూడా ఇంకా తెలియలేదు. అధికారులు స్పందించి చెరువులోని మొసలిని పట్టుకెళ్లాలని ఆ పరిసరవాసులు కోరుతున్నారు.