ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

పిల్లి మూలంగా విమానం అత్యవసర ల్యాండింగ్

టార్కో ఏవియేషన్‌కు చెందిన విమానం సూడాన్‌ రాజధాని ఖార్టూమ్‌ నుంచి ఖతార్‌ బయలుదేరింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌లో వచ్చిన పిల్లి పైలట్‌పై దాడి చేయడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ పిల్లి అసలు విమానంలోకి ఎలా వచ్చిందనే విషయం మీద స్పష్టత లేదు. బహుశా రాత్రి విమానాన్ని శుభ్రం చేసే సమయంలో ఆ పిల్లి అక్కడే నక్కి ఉంటుందని అనుకుంటున్నారు. ఈ ఘటనపై టార్కో ఏవియేషన్‌ ఇప్పటివరకు స్పందించలేదు. ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు విమానాన్ని గంటల తరబడి నిలిపివేసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని సిబ్బంది చెప్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.