మార్చి నెల 8 వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డి‌జి‌పి కార్యాలయం లో ఎపి డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS ఉచిత మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు. దీనిని డి‌జి‌పి కార్యాలయంలో ఎపిక్ ఫ్యూజన్ హెల్త్ కేర్ సొల్యుషన్స్ వారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. పోలీస్ ప్రధాన కార్యాలయం లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినిలకు, మహిళా సిబ్బంది కొరకు ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు.


ఈ తరుణంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతం సవాంగ్ IPS మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రప్రదమంగా మహిళల రక్షణ మరియు భద్రత కు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా దిశ ప్లాట్ఫాం ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది.

. ఈ సందర్భంగా ప్రతి ఒక్క మహిళ తప్పనిసరిగా దిశ యాప్ ను తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.అదే విధంగా ప్రజలకు ఉత్తమమైన సేవలను అందించేందుకు ప్రవేశపెట్టిన అదునాతన సాంకేతిక టెక్నాలజీ వినియోగంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ దేశానికే తలమానికంగా నిలిచిందని, మహిళా సమాజంలో తల్లిగా, చెల్లిగా, అక్కగా,మహిళల అద్వితీయమైన పాత్రను పోషిస్తున్నారని డిజిపి కొనియాడారు. అటువంటి మహిళలకు సేవ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందనీ, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని, వారి ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ రోజు ఉచిత మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎపిక్ ఫ్యూజన్ హెల్త్ కేర్ సొల్యుషన్స్ సిఈఓ శ్రీధర్ రెడ్డి,అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ L&O రవిశంకర్ అయ్యన్నార్ IPS,IG P&L నాగేంద్ర కుమార్ IPS, ఓఎస్డి భద్రత రామకృష్ణ IPS( రిటైర్డ్) మరియు మహిళా సిబ్బంది పాల్గొన్నారు.