ఇండియన్ రైల్వేస్ నుండి వెలువడుతున్న నివేదికల ప్రకారం రైల్వే శాఖ ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు పెంచినట్లు తెలుస్తోంది. అలాగే లోకల్ జర్నీకి సంబంధించి కనీస చార్జీలను కూడా భారీగా పెంచేసింది. ఇటీవలనే ముంబైలో పలు రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ.50 పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఇతర తన నెట్‌వర్క్‌లో ఇతర ప్రాంతాల్లో కూడా ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు పెంచిందని నివేదికలు వెలువడుతున్నాయి. ప్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ.10 నుంచి రూ.30 పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మందిపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.
వచ్చే సమ్మర్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ఇండియన్ రైల్వేస్ కరోనా వైరస్ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండేలా చూసుకోవడానికి, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడానికి కూడా ఈ నిర్ణయం దోహదపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కేవలం ప్లాట్‌ఫామ్ టికెట్ ధర మాత్రేమ కాకుండా లోకల్ జర్నీ కనీస చార్జీ రూ.10 నుంచి రూ.30కు పెరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో ప్రయాణికులకు కూడా ప్రతికూల ప్రభావం పడనుంది. అయితే పెంపు నిర్ణయం తాత్కాలికమని రైల్వే శాఖ పేర్కొన్నట్లు నివేదికలు తెలియచేస్తున్నాయి. నిజానిజాలు తెలియాలంటే ఇంకా వేచి చూడవలసిందే!