టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ సరసన చేరి ఒక రికార్డు సొంతం చేసుకున్నారు. మొతేరా వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ శుక్రవారం డకౌటయ్యారు. బెన్‌స్టోక్స్ విసిరిన ఓ షార్ట్‌పిచ్ బంతిని వేటాడబోయి కీపర్ ఫోక్స్ చేతికి చిక్కడంతో టీమ్ఇండియా 41 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది. టీమ్ఇండియా సారథిగా కోహ్లీకిది టెస్టుల్లో ఎనిమిదో డకౌట్. కావడంతో మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ సరసన కోహ్లీ నిలిచారు. ధోనీ సైతం కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో ఎనిమిది సార్లు టెస్టుల్లో ఇలా సున్నా పరుగులకే ఔటవ్వడంతో వీరిద్దరూ భారత్ తరఫున అత్యధిక డకౌట్లు అయిన టెస్టు కెప్టెన్లుగా రికార్డులకెక్కారు. విరాట్ కోహ్లీ కెరీర్లో ఒక సిరీస్‌లో రెండుసార్లు డకౌటవ్వడం ఇది రెండో సారి. 2014లోనూ ఇంగ్లాండ్ జట్టు చేతిలోనే టీమ్ఇండియా కెప్టెన్ ఒకే సిరీస్‌లో రెండు సార్లు పరుగులు చేయకుండా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ విరాట్‌ను ఔట్ చేయడం వల్ల టెస్టుల్లో అత్యధికంగా ఐదు సార్లు పెవిలియన్‌కు చేర్చారు. రే బ్యాట్స్‌మెన్ కూడా స్టోక్స్ చేతిలో ఇన్నిసార్లు వికెట్స్ కోల్పోలేదు. డీన్ ఎల్గర్, మైఖేల్ క్లార్క్, చేతేశ్వర్ పుజారా ఇదివరకు నాలుగు సార్లు స్టోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యారు.