పీఎల్‌ఐ పథకంపై మోదీ వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు దాని పరిమాణాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. మెరుగైన ఉత్పాదక సామర్థ్యం ఉద్యోగ అవకాశాలను పెంచుతుందని, ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం అవసరమైన సంస్కరణలు చేపడుతోందని మోదీ స్పష్టం చేశారు. దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు పీఎల్​ఐ పథకానికి రూ.2లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మోదీ గుర్తు చేసుకోవాలన్నారు. దేశీయ ఉత్పత్తుల గురించి మాట్లాడిన మోదీ నాణ్యత ప్రమాణాలు, ఉత్పత్తి వ్యయాలు, సామర్థ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.