మొత్తంగా 766.59 కిలోమీటర్ల పొడవైన రోడ్లు జాతీయ రహదారుల జాబితాలో చేరుకున్నాయి. అంటే రాష్ట్ర రహదారులుగా ఉన్న 11 మార్గాలకు జాతీయ రహదారుల హోదా లభించినట్టయింది. వీటిలో అయిదింటికి నంబర్లూ కేటాయించారు. మిగిలిన ఆరింటి పూర్తి వివరాలు ఇస్తే వాటికీ నంబర్లు ఇవ్వనున్నారు. ఆయా రహదారులకు కన్సల్టెంట్‌ సంస్థల ద్వారా సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేయించి, డీపీఆర్‌లు సిద్ధం చేస్తే ఆ తరువాత వచ్చే వార్షిక ప్రణాళికలో నిధులు కేటాయించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. డీపీఆర్‌లు సిద్ధం ఐతే మొత్తం 11 రహదారుల్లో
3 మినహా మిగిలినవన్నీ రాయలసీమ పరిధిలోకి వస్తాయి. ఆ రహదారుల్లో వాహన రద్దీ తదితరాలను పరిగణలోకి తీసుకుని ఉన్నదానిని 10 మీటర్లకు విస్తరించాలా? నాలుగు వరుసలు చేయలా అనేది పరిశీలించి నిర్ణయిస్తారు.