ఆస్తుల బదిలీ (దస్తావేజుల రిజిస్ట్రేషన్‌) కోసం వసూలు చేసే స్టాంపు సుంకాన్ని (డ్యూటీ) పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనివలన ప్రజలపై ఏటా రూ.250 కోట్ల వరకు ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రంలో సుమారు 25 నుంచి 30 రకాల స్టాంపు డ్యూటీలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం దస్తావేజులోని ఆస్తి విలువ, రకాన్ని బట్టి 1% నుంచి 5% వరకు ప్రభుత్వం సుంకం వసూలు చేస్తోంది. కానీ ఇకపై వీటిని రెండు స్లాబుల (5%, 2%) కింద వర్గీకరించనున్నారు. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న స్టాంపు డ్యూటీపై అధ్యయనం మొదలుపెట్టారు. వీటిపై అధికారిక నిర్ణయం వెలువడితే ప్రజలపై ఏటా రూ.250 కోట్ల వరకు ఆర్థిక భారం పడుతుంది.