H-1B Visa Ban వీసాలపై మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిషేధం విధించిన విషయం పాఠకులకు తెలిసినదే! ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆ నిషేధాన్ని ఎత్తివేయడంపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. పదవి చూపెట్టిన వెంటనే ఆ ఆంక్షలు ఎత్తివేస్తామని, వలస విధానాన్ని సమూలంగా సంస్కరిస్తామని చెబుతూ వస్తున్న బైడెన్‌ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే హెచ్-1బీ వీసాలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధం మార్చి 31తో ముగియనుంది. ఆయన పదవి నుంచి నుంచి దిగిపోయే ముందు జనవరిలో దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. కానీ దీనిపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో బైడెన్ యంత్రాంగం ఊగిసలాట ధోరణిలో ఉంది.

ఈ తరుణంలో తక్కువ వేతనాలతో లభించే విదేశీ ఐటీ నిపుణులను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్న కంపెనీలకు ఆంక్షలు విధిస్తూ స్వదేశీయులకు అధిక ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ముగ్గురు రిపబ్లికన్లు కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టగా, ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం పేరుతో రిపబ్లికన్ పార్టీకి చెందిన మో బ్రూక్స్, మ్యాట్ గాయేట్జ్, లాన్స్ గూడెన్‌లు ఈ బిల్లును ప్రతిపాదించారు. బిల్లు యొక్క ప్రతిని బుధవారం విడుదల చేసిన రిపబ్లికన్‌లు హెచ్‌1బీ వీసాతో వేలాది ఐటీ నిపుణులను భారత్‌, చైనాల నుంచి అమెరికాకు తీసుకురావడం వల్ల సమాన అర్హతలు కలిగిన అమెరికా యువత ఉపాధి అవకాశాలు కోల్పోతోందని ఆరోపించారు.

హెచ్-1బీ వీసాతో అమెరికాకు వచ్చే విదేశీ నిపుణులకు ఇచ్చే వార్షిక వేతనం అదే స్థాయిలో అమెరికన్లకు ఇచ్చే వేతనం కన్నా ఎక్కువగా ఉండాలనే నిబంధన ఆ బిల్లులో చేర్చగా, ఈ మేరకు కంపెనీ యాజమాన్యం కార్మికశాఖ కార్యదర్శికి దరఖాస్తును అందజేయాలి. ఒక విదేశీ అతిథి కార్మికుడిని వృత్తిపరమైన వర్గీకరణలో H-1B నాన్-ఇమ్మిగ్రెంట్‌గా చేర్చడం లేదా గుర్తించడం కుదరదు. అంతేకాకుండా హెచ్‌1బీ వీసాదారుల వల్ల రెండేళ్ల వరకూ అమెరికన్ల ఉద్యోగాలకు ఎటువంటి ముప్పు ఉండబోదని హామీని ఇవ్వాలి. విదేశీయులకు గ్రీన్‌కార్డుల మంజూరు కోసం నిర్వహించే లాటరీని కూడా నిలిపివేయాల్సి ఉంటుంది. మరియు ఉద్యోగాలలో అమెరికన్లకే తొలి ప్రాధాన్యత ఇస్తుంది. హెచ్ -1బీ వీసా కార్యక్రమానికి అవసరమైన సంస్కరణలు మరియు పర్యవేక్షణను కూడా తీసుకువస్తుంది. అమెరికా కార్మికులు తమ దేశంలో ఇకపై వెనుకబడి ఉండకుండా చూసుకోవాలని బ్రూక్స్ చెప్పారు.

‘అత్యంత తక్కువ వేతనాలకు విదేశీ కార్మికులను తీసుకొచ్చే చర్యలు, ఈ బిల్లు యజమానులు ఏదైనా H-1B కార్మికులకు కనీసం 110,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది’ అని ఆయన చెప్పారు.డొనాల్డ్‌ ట్రంప్‌ దిగిపోవడానికి ముందు ఈ ఏడాది జనవరిలో తీసుకొచ్చిన హెచ్‌1బీ వీసా విధానాన్నే అమలు చేయాలని రిపబ్లికన్లు కోరుతున్నారు. ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు ఆధిక్యం ఉంది కావున ఈ బిల్లుకు ఆమోదం లభించడం కష్టమేనన్న అభిప్రాయం వినవస్తుంది.