కర్నూల్ జిల్లాలో మంత్రాలయం మండలంలోని చేటనేపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. గ్రామ సమీపంలో ఆటో, కారు ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.