వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

రోహిత్ శర్మ రికార్డు

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఓపెనర్‌గా రికార్డు సృష్టించారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతడు 49 పరుగులు చేసి స్టోక్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యారు. ఈ తరుణంలో టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఓపెనర్ల జాబితాలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవగా, రోహిత్‌ తర్వాత డేవిడ్‌ వార్నర్‌(948), డీన్‌ ఎల్గర్‌(848) ఉన్నారు.

ఇక టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఆసియా ఆటగాడిగానూ హిట్‌మ్యాన్‌ రికార్డు నెలకొల్పారు. మరోవైపు ఉప సారథి అజింక్య రహానె (1,068) సైతం ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన మరో భారత ఆటగాడిగా నిలిచారు. ఇక మార్నస లబుషేన్‌(1,675), జోరూట్‌(1,630), స్టీవ్‌స్మిత్‌(1,341), బెన్‌స్టోక్స్‌ (1,301) మాత్రమే టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ కన్నా కొంచం ముందున్నారు. ఇదే ఇన్నింగ్స్‌తో రోహిత్ మయాంక్‌ అగర్వాల్‌ పేరిట ఉన్న మరో రికార్డును తిరగరాశారు. టెస్టుల్లో 17 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఆసియా ఆటగాడిగా రికార్డులకెక్కారు. ఇదివరకు మయాంక్‌ 19 ఇన్నింగ్స్‌ల్లో ఆ ఘనత సాధించారు. ఇక టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో వేగవంతంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గానూ ఇంకో రికార్డు తన ఖాతాలో వేసుకోగా, గతంలో వినోద్‌ కాంబ్లీ 14 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డు నమోదు చేశారు. పుజారా 18 ఇన్నింగ్స్‌ల్లో సాధించారు.

మరోవైపు టెస్టుల్లో ఆల్‌టైమ్‌ ఓపెనర్లలో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గానూ రోహిత్‌ శర్మ మరొక ఘనత సాధించడంతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌స్మిత్‌ సరసన చేరారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.