ఇటీవల కేంద్రం ఓటీటీల నియంత్రణకు మార్గదర్శకాలు తెచ్చిన సంగతి పాఠకులకు విదితమే! అయితే ఇప్పుడు ఆ మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.
నూతన మార్గదర్శకాలు పూర్తి స్థాయిలో ఓటీటీలను నియంత్రించలేవని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓటీటీల నియంత్రణకు మార్గదర్శకాలు కాకుండా చట్టం తెచ్చే దిశగా సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది.

వివాదాస్పద కంటెంట్​ వ్యవహారంలో అమెజాన్ ప్రైమ్ అధినేత అపర్ణా పురోహిత్ కు మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. ‘తాండవ్’ వెబ్ సిరీస్​లో మతపరమైన మనోభావాలన దెబ్బతీశారని యూపీలో దాఖలైన కేసుపై సుప్రీంను ఆశ్రయించారు అమెజాన్ ప్రైమ్ అధినేత. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ దర్యాప్తునకు సహకరించాలని అపర్ణా పురోహిత్​ను ఆదేశించింది. ఈ సందర్భంగా ఓటీటీల మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.