చైనా వ్యోమనౌక తియాన్‌వెన్‌-1 అంగారక కక్ష్యలో తిరుగుతున్న సంగతి పాఠకులకు విదితమే! అంగారక కక్ష్యలో తిరుగుతున్న చైనా వ్యోమనౌక తియాన్‌వెన్‌-1 అరుణ గ్రహ ఉపరితలానికి 330 నుంచి 350 కిలోమీటర్ల ఎగువ నుంచి వీటిని తీసింది. మంచి హై రిజల్యూషన్‌ చిత్రాలను క్లిక్‌మనిపించింది. వీటిలో రెండు పాన్‌క్రొమాటిక్‌ చిత్రాలు కూడా ఉన్నాయి. అంగారకుడిపైనున్న చిన్నపాటి బిలాలు (620 మీటర్ల వెడల్పు కలిగిన ఒక బిలం) పర్వత పంక్తులు, ఇసుక తిన్నెలు వంటివి ఈ ఫొటోల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌తో కూడిన తియాన్‌వెన్‌-1 గత నెల 24న అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ఏడాది మే లేదా జూన్‌లో అరుణ గ్రహ దక్షిణార్ధగోళంలోని ఉటోపియా ప్లానీషియా అనే ప్రాంతంలో ల్యాండర్‌, రోవర్‌ దిగుతాయి. 240 కిలోల బరువున్న ఈ రోవర్‌ తన ఆరు చక్రాల సాయంతో గంటకు 200 మీటర్ల దూరం ప్రయాణించగలదు.