సృజనాత్మకతకు హద్దులు లేవనేది జగమెరిగిన సత్యం. వరంగల్‌ కాకతీయ క్యాంపస్‌
సుందరీకరించాలని నిర్ణయించుకున్నారు. ఆ సుందరీకరణలో భాగంగా యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్‌ కార్యాలయం ఎదుట ఒక ఫౌంటెయిన్ నిర్మించారు. మధ్యలో పైపు ఏర్పాటు చేసి నీటిని విరజిమ్మే పరికరం బిగించడం మరిచారు. దానిలో వింత లేదు కానీ సిబ్బందిలో ఎవరికి ఆ ఆలోచన వచ్చిందో కానీ ఒక నీటిసీసాకు రంధ్రాలు చేసి పైపునకు బిగించి తమలోని సృజనాత్మకతను చాటుకున్నారు. ఆ ఫౌంటెయిన్ నీరు ఇలా విరజిమ్ముతూ చూపరులకు ఆహ్లాదం పంచుతోంది.